Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్.! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్‌.

0 minutes, 3 seconds Read


బిగ్‏బాస్ రియాల్టీ షో సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‏కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. గతేడాది డిసెంబర్ నెలలో విధ్వంసం, అల్లర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించిన కేసులో ప్రశాంత్.. అతడి సోదరుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. జైలుకు వెళ్లిన రెండు రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పై విడుదలైన ప్రశాంత్ కోర్టు కండిషన్స్ ప్రకారం.. ప్రతి నెల జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ కేసులో ప్రశాంత్ కు ఊరట లభించింది. ఇక పై అతను జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానవసరం లేదని కోర్టు పేర్కొంది. కోర్టు విధించిన రెండు నెలల గడువు పూర్తి కావడంతో ప్రశాంత్ తరపు లాయర్లు రిలాక్సేషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంత్ తోపాటు.. అతడి సోదరుడు ఇకపై పోలీసులు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెల్చీ చెప్పింది. దీంతో ఈ కేసులో ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లే. రైతుబిడ్డగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో.. ప్రవర్తనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని సీజన్ 7 విజేతగా నిలిచాడు. కానీ విన్నర్ అయ్యాక కొన్ని గంటల్లోనే అల్లర్ల కేసులో అరెస్ట్ అయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..



Source link

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Havells ST7000 Rechargeable Dual-Blade Shimmer (Shaver cum Trimmer) with 3 Trimming Combs (Black & Yellow) Vega Cleanball Body Trimmer for Body Trimmer of Men, Beard, Body, Pubic Hair Grooming, 90 Min Runtime with LED Flashlight, 4 Comb Attachments, Shower Friendly, (VHTH-33) 98°F T-Shirt Unisex Regular Fit Casual Half Sleeve Round Neck Inner Element Boys Tshirt | Pack of Three Black White Red T-Shirt VARGHESE Paul Tshirt Men’s Regular Fit Polo Shirt,Collar Half Sleeve Cotton Stylish Tshirt MONAL Men’s Solid Polyester Regular Fit T-Shirt