PM Modi: మోదీ క్రేజ్ ఏమాత్రం తగ్గేదేలే.. అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో నిలిచిన భారత ప్రధాని..

0 minutes, 12 seconds Read


ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్.. భారత ప్రధానమంత్రికి నానాటికి పెరుగుతుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. తాజాగా.. 78.5% ఆమోదం రేటింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సర్వే తెలిపింది. మార్నింగ్ కన్సల్ట్ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల ఆమోదం రేటింగ్‌లను ఇటీవల జనవరి 30 – ఫిబ్రవరి 5 మధ్య సేకరించింది. ఈ డేటా ఆధారంగా.. మార్నింగ్ కన్సల్ట్ ప్రధాని మోదీ మరోసారి ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా టాప్ ర్యాంకింగ్ లో నిలిచినట్లు వెల్లడించింది. ఈ రేటింగ్‌లు ప్రతి సర్వే చేయబడిన దేశంలోని పెద్దలలో.. ఏడు రోజుల సగటు అభిప్రాయాలను సూచిస్తాయని.. మార్నింగ్ కన్సల్ట్ తన నివేదికలో పేర్కొంది. ప్రాతినిధ్య నమూనాలకు పరమితులుంటాయని.. లక్ష్య జనాభా తదనుగుణంగా మారుతూ ఉంటుందని తెలిపింది. ఈ పద్దతి విధానం వివిధ జనాభా, భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తుల వివరాలను వెల్లడిస్తుంది.

ఇదిలా ఉంటే, మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 64%తో రెండవ స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అలైన్ బెర్సెట్ 57% ఆమోదం రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. పోలాండ్‌కు చెందిన డొనాల్డ్ టస్క్ 50% రేటింగ్‌తో నాల్గవ స్థానంలో ఉండగా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా 47% రేటింగ్‌తో ఐదోస్థానంలో.. ఆస్ట్రేలియన్ ప్రీమియర్ ఆంథోనీ అల్బనీస్ 45 శాతం ఆమోదం రేటింగ్‌తో ఆరోస్థానంలో నిలిచారు. ఏడో స్థానంలో ఇటలీ జార్జియా మెలోని, ఎనిమిదో స్థానంలో స్పెయిన్ కు చెందిన పెడ్రో, 9వస్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, 10వ స్థానంలో కెనడా జస్టిన్ ట్రూడో, 12వస్థానంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ నిలిచారు.

ఈ క్రమంలో దౌత్యవేత్త వ్యాపార సలహాదారుడు ఎరిక్ సోల్హిమ్ కీలక ట్వీట్ చేశారు. పాశ్చాత్య నాయకులు ఎంత అసూయతో ఉన్నారు? ప్రధాని మోడీకి నమ్మశక్యం కాని 77% ఆమోదం రేటుతో, పాశ్చాత్య మీడియా భారతదేశానికి మోడీజీకి కొంత సానుకూల కవరేజీని అందించే సమయం వచ్చిందా? అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో రాశారు.

కాగా.. ప్రపంచ వేదికలపై నరేంద్ర మోదీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. అంతేకాకుండా.. ఇతరదేశాలతో భారత్ అనుసరిస్తున్న దౌత్య విధానం, భాగస్వామ్య చర్చలు.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. అంతర్జాతీయ ఆమోదం రేటింగ్స్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ప్రశంసిస్తున్నారు. అనేక మంది ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్‌లలో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉండటం మోదీ క్రేజ్ మరింత పెరిగిందనడానికి నిదర్శమంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Havells ST7000 Rechargeable Dual-Blade Shimmer (Shaver cum Trimmer) with 3 Trimming Combs (Black & Yellow) Vega Cleanball Body Trimmer for Body Trimmer of Men, Beard, Body, Pubic Hair Grooming, 90 Min Runtime with LED Flashlight, 4 Comb Attachments, Shower Friendly, (VHTH-33) 98°F T-Shirt Unisex Regular Fit Casual Half Sleeve Round Neck Inner Element Boys Tshirt | Pack of Three Black White Red T-Shirt VARGHESE Paul Tshirt Men’s Regular Fit Polo Shirt,Collar Half Sleeve Cotton Stylish Tshirt MONAL Men’s Solid Polyester Regular Fit T-Shirt